Sunday, August 21, 2011

ఇట్లు.....మీ నాన్న!



నా కవితాభిమాన స్నేహితుడు గవిరెడ్డి వెంకటరమణ కోరికపై వ్రాసిన కవిత ఇది...


"నీవు నీవేనా రా చిట్టికన్నా?
 లేక మా ఇద్దరి ప్రేమను కలుపుకొని,
 మైమరపించే నవ్వులతో మా ముందుకొచ్చిన వరాల మూటవా?
 నీ అల్లరిలో నా పసితనం ఉంది!
 నీ రూపంలో మీ అమ్మ సుకుమారముంది!
 నీ చిరాకులో మా నిర్లక్ష్యం కనిపిస్తుంది.
 ఆ బోసి నవ్వులలో మా ప్రేమ కనిపిస్తుంది.
 నీ సంజ్ఞల భాష మాకు అర్థంకాదు,
 కానీ దాని మరమార్థాన్ని మాత్రం అర్థమయ్యేలా ప్రవర్తిస్తావు.
 నీకు మాటలు రావని ఎవరన్నారు?
 వాటిని అర్థం చేసుకొనే పరిజ్ఞామే మాకు లేదురా!
 మేము కనబడకపోతే నీలో కనిపించే ఆరాటం!
 కనపడిన వెంటనే నీ మోమున మెరిసే వెన్నెల...
 ఎన్ని సార్లు చూసినా తనివి తీరదురా బుజ్జి తల్లీ...
 నీ రాకతో మా జీవితాలలో సంతోషాన్ని నింపావు.
 ఈ ఆనందం నిండు నూరేళ్ళూ ఇలానే వుండేలా చూడమని,
 ఆ దేవుడ్ని ప్రార్థిస్తూ.......
         మా గారాల పట్టి "కుసుమాంజలి"కి ఇదే నా కవితాంజలి...

                      ఇట్లు,
                      మీ నాన్న.  "



4 comments:

Anonymous said...

Sri Krishna Chaithanya: ‎100 likes...chala bavundandii..

Anonymous said...

Sri Krishna Chaithanya: chala baga wraasaru.. especially middle part...

Anonymous said...

Raghavendra Nuttaki: నీకు మాటలు రావని ఎవరన్నారు?
వాటిని అర్థం చేసుకొనే పరిజ్ఞామే మాకు లేదురా! వాస్తవమే డియర్ చైతన్య నీ మాటను నీ చేతను నీ అలికిడి ,నీ ముఖ కవళికల వేదనలు సంతోషాలు ఆనందాలు అన్నీ అర్ధం చేసుకోని అనుగుణంగా వక్ర్తించే చిన్నారులు బాగుంది .

Anonymous said...

నా పేరు శంకర్: Nice dear...

Post a Comment