Friday, June 22, 2012

ఏమయింది! ఏమయింది!

నన్ను తాకిన పరిమళానికి,
మల్లె తనువులు ముద్దులిడెనా..
మత్తు మత్తుగ హత్తుకుంటూ,
మైకమై నా మీద వాలెను!
నిన్ను వెతుకగ నన్ను తరిమి,
నీడలా నా వెంట వచ్చెను,
ఏమయింది! ఏమయింది!
నిన్ను చూడగ నాకేమయింది!

ఎంత కాలము ముస్తాబు చేస్తివో..
నా కంటపడెను నీ చూపు హొయలు!
చూడమంటూ నా భుజము తడుతూ..
చూడగానే సిగ్గంటూ దాగుతు,
అల్లరెంత చేసినాయో...అలసిపోయిన మనసుకెరుక.
ఏమయింది! ఏమయింది!
నిన్ను చూడగ నాకేమయింది!

****** నచ్చితేనే కామెంట్ వ్రాయండి...
 

3 comments:

Padma Sreeram said...

ఏమయింది! ఏమయింది!
నిన్ను చూడకుంటే నాకేమయింది!


అనుకునేంత అద్భుతంగా....ఉంది...చైతన్యా అక్షర కొరత... ఇంతకన్నా చెప్పనీయని భావాల వెలితి...

మెర్సీ మార్గరెట్ said...

ఎంత కాలము ముస్తాబు చేస్తివో..
నా కంటపడెను నీ చూపు హొయలు!...
chupula hoyalu musthaabayithe .. inkaa aa valalo padi gila gila laadadame kadha...

bagundi anna...

Anonymous said...

parimala bharitham mee kavitvam

Post a Comment